24 ఏళ్ల తరువాత రాజ్యసభకు మ‌ళ్లీ మాజీ ప్ర‌ధాని!

September 21, 2020 at 9:25 am

మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ(87) మ‌ళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చేతులు జోడించి చైర్మన్‌కు కన్నడలో ధన్యవాదాలు తెలిపారు దేవెగౌడ.

దేవెగౌడ 1994 నుండి 1996 వరకు కర్నాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ త‌ర్వాత 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు ఆయ‌న ప్ర‌ధానిగా దేశానికి సేవలనందించాడు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. ఆ తరువాత 24 సంవత్సరాలకు ఇప్పుడు మరోసారి అదే సభకు వెళ్ల‌డం విశేషం.

ఈ సంవత్సరం జూన్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఆయన ఎన్నికైన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్‌ ఉండడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేదు. ప్ర‌స్తుత సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన రాగా.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

24 ఏళ్ల తరువాత రాజ్యసభకు మ‌ళ్లీ మాజీ ప్ర‌ధాని!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts