ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆ రోజు నుంచే అందుబాటులోకి..

September 26, 2020 at 6:51 pm

భూముల క్ర‌య‌విక్ర‌యాలు, రెవెన్యూ సంబంధిత అన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర‌ణి వెబ్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లెనే కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌చ్చిన సంద‌ర్భంగా దీనిని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అప్ప‌టి వ‌ర‌కు భూ రిజిస్ట్రేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తున్నారు. అయితే ఈ పోర్ట‌ల్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంది? రిజిస్ట్రేష‌న్లు ఎప్పుడు మొద‌ల‌వుతాయి? అని చాలా మంది కొనుగోలు దారులు, భూ యాజ‌మానులు ఎదురు చూస్తున్నారు. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజునుప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజున ఆయ‌నే ప్రారంభించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా అధికారులకు ప‌లు అంశాల‌పై కీల‌క ఆదేశాల‌ను జారీ చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని ప‌నుల‌ను ఆ లోపుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని, మారిన రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్,, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తాసిల్దార్లు, డీటీల‌కు, సబ్ రిజిస్ట్రార్ల‌కు అవసరమైన శిక్షణ ఇవ్వాల‌ని సూచించారు. డెమో ట్రయల్స్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియోమకాన్ని పూర్తి చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. పోర్టల్ను ప్రారంభించ‌డానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయిస్తామ‌ని సిఎం స్ప‌ష్టం చేశారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని స్ప‌ష్టం చేశారు.

ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆ రోజు నుంచే అందుబాటులోకి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts