ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి మ్యాచ్ ముందే భారీ షాక్..!

September 20, 2020 at 2:49 pm

ఎట్టకేలకు ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రికెట్ ప్రేక్షకులందరికీ దాదాపు ఆరు నెలల తర్వాత అంతకుమించి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమైంది ఐపీఎల్. నిన్న చెన్నై ముంబై జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్… కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోరు జరిగేందుకు అంతా సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో మొదటి మ్యాచ్ కి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి భారీ షాక్ తగిలింది.

ప్రస్తుతం ఢిల్లీ కాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ కు గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో భాగంగా ఇషాంత్ శర్మ కాలికి గాయం అయ్యిందట… ఈ గాయం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని.. తొలి మ్యాచ్ లో మాత్రం ఇషాంత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం లేదు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే పేసర్ ఇషాంత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి మ్యాచ్ ముందే భారీ షాక్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts