`దిశ ఎన్ కౌంటర్` ట్రైలర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

September 26, 2020 at 10:09 am

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన రామ్ గోపాల్ వ‌ర్మ‌.. లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌ర్మ చేస్తున్న చిత్రం `దిశ ఎన్ కౌంటర్`. 2019 లో హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో నిందితుల‌ను పోలీసుల ఎన్‌కౌంటర్ చేసిన‌ విషయం తెలిసిందే.

ఈ ఘటన ఆధారంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ రిలీజ్‌ చేశారు. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ను నేటి ఉదయం 9.08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. చెప్పిన‌ట్టుగానే ట్రైల‌ర్ విడుద‌ల చేశాడు వ‌ర్మ‌.

ఈ టైల‌ర్‌లో దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. అపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. కాగా, న‌వంబ‌ర్ 26, 2020లో సినిమా విడుద‌ల‌ కాబోతుంది. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తుండ‌గా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

`దిశ ఎన్ కౌంటర్` ట్రైలర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts