సంబరాలు చేసుకున్న తల్లిదండ్రుల ఎందుకో తెలుసా..?

September 30, 2020 at 6:49 pm
AUTISM-BOY

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. వాళ్ళకి వచ్చి రాని మాటలతో మాట్లాడుతుంటే అది చుసిన తల్లిదండ్రులకు చెప్పలేని అనుభూతిని పొందుతారు. ఇక అప్పుడప్పుడే మాట్లాడడం నేర్చుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి ముద్దుముద్దు మాటలు విని చాల ఆనంద పడుతున్నారు. అయితే మీకా అనే బాలుడు ఆటిజం వల్ల మాట్లాడలేకపోయారు. అతడి మాటలు వినాలి అని కలలు కన్న తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. అయితే అతడికి అశాబ్దిక ఆటిజం(నాన్‌వర్బల్‌ ఆటిజం) ఉందని వైద్యులు చెప్పారు. అంటే పదాలను పలికే సామర్థ్యం లేదన్నమాట.

అయితే, తల్లిదండ్రులు అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దీంతో ఐదేళ్లు వచ్చేసరికి ఆ బాలుడు మాట్లాడడం నేర్చుకున్నాడు. అయితే తొలిసారి తన పేరును చెప్పగా, తల్లిదండ్రులు చూసి తెగ మురిసిపోయారు. అనంతరం కుటుంబంలోని ఒక్కొక్కరి పేర్లు చెప్పాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడు మాట్లాడుతుంటే తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

సంబరాలు చేసుకున్న తల్లిదండ్రుల ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)