భట్టిని వదలని తలసాని…లక్ష చూపించకపోతే…

September 18, 2020 at 11:40 am

తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…ప్రతిపక్ష నాయకుడు భట్టివిక్రమార్కల మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో మంత్రి తలసాని, భట్టికి మధ్య డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో వాదోపవాదాలు జరగాయి. ఆ వెంటనే తనతో వస్తే ఇళ్ళు చూపిస్తానంటూ తలసాని సవాల్ చేశారు. ఆ సవాల్ ప్రకారం గురువారం తలసాని, భట్టి ఇంటికెళ్లారు. అలాగే ఆయన భట్టిని తన కారులో డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించేందుకు తీసుకెళ్లారు.

ఇక వీరి పర్యటన ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భట్టి లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు చూపించేవరకు వదలనని అన్నారు. నిన్న కేవలం మూడువేల ఇళ్లను మాత్రమే తనకు మంత్రి తలసాని చూపించారన్నారు. ఇవాళ కూడా చూపించి మూడువేల అంటున్నారని, గ్రేటర్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నామన్న అధికార పార్టీ తనకు ఆ ఇళ్లనంటిని చూపించాల్సిందేనని అన్నారు. తనకు లక్ష ఇళ్లు చూపించేవరకు మంత్రిని వదిలేది లేదన్నారు.

అటు తలసాని కూడా ప్రతిపక్షం జరిగిన అభివృద్ధిని ఒప్పుకోవాలన్నారు. భట్టికి ఇవాళ కూడా పలు ఇళ్లను చూపిస్తామన్నారు. గ్రేటర్‌లో ఇళ్లనే చూపిస్తామన్నారు. వాళ్లేదో చేసినట్లు మాట్లాడొద్దంటూ ప్రతిపక్షంపై తలసాని మండిపడ్డారు.

భట్టిని వదలని తలసాని…లక్ష చూపించకపోతే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts