హైద‌రాబాద్‌లో భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హం.. ఎలా ఉండ‌నుందంటే..

September 16, 2020 at 7:22 pm

హైద‌రాబాద్ లో భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ది. దేశంలోనే ఎక్క‌డా లేనివిధంగా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డంతో పాటు లైబ్ర‌రీ, మ్యూజియం, ఆడిటోరియాన్ని నిర్మించ‌నున్నారు. ఈ మేర‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ వెల్ల‌డించారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన అనంత‌రం మంత్రులు ఈట‌ల రాజేందర్ ,కొప్పుల ఈశ్వర్ ,సత్యవతీ రాథోడ్ ,ప్రభుత్వ విప్ బాల రాజు ,రేగా కాంతా రావు ,ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బాల్క‌సుమ‌న్ తో క‌లిసి విలేక‌రుల స‌మావేశాన్ని ఆయ‌న ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించి జీవో నంబర్ 2 విడుదలైంద‌ని, 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంక‌ల్పించార‌ని వివ‌రించారు. హుస్సేన్ సాగర్ సమీపం లో రూ.140 కోట్లతో విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డంతో పాటు, 11 ఎకరాల స్థలం లో అంబెడ్కర్ పార్కును తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఆ పార్కు లో విగ్రహం తో పాటు ,మ్యూజియం ,లైబ్రరీ కూడా నిర్మిస్తామ‌ని, సీఎం కెసిఆర్ కు దళిత ,గిరిజన ,మైనారిటీ వర్గాలు రుణ పడి ఉంటాయ‌ని తెలిపారు. ఇక అంబేద్క‌ర్ విగ్ర‌హం వెడల్పు 45 .5 ఫీట్లుకాగా, త‌యారీకి 791 టన్నుల స్టీలును, 96 మెట్రిక్ టన్నుల ఇత్త‌డిని వినియోగించ‌నున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం అంబెడ్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.

హైద‌రాబాద్‌లో భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హం.. ఎలా ఉండ‌నుందంటే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts