ఏపీలో డ్రీమ్ 11 యాప్ బ్యాన్…?!

September 29, 2020 at 4:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గేమింగ్ చట్టాల్లో చేసిన మార్పుల కారణంగా తాజాగా జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 సీజన్ సంబంధించి టైటిల్ స్పాన్సర్ అయినా ఫాంటసీ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 ను బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఈ యాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాన్ అయిందని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది వరకే తెలంగాణ రాష్ట్రంలో ఈ యాప్ బ్యాన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ యాప్ బ్యాన్ చేసినట్టు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. దీంతో డ్రీమ్ 11 యూజర్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

 

ఇదివరకే రమ్మీ , ఆన్లైన్ జూద ఆటలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం సంగతి కూడా విధితమే. ఇకపోతే మై 11 సర్కిల్, మొబైల్ ప్రీమియర్ లీగ్, డ్రీమ్ 11 , మై టీం లెవెన్, స్కిల్స్ ఫర్ ట్యూన్ ఇలా పేర్లు వేరైనా చేసేది మాత్రం ఒకటే పని. ఈ యాప్స్ అన్ని కూడా మనిషికి ఒక వ్యసనం లాగా మారి మనిషి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ముందుగా ఆ యాప్స్ ఉచితంగా ఆడే అవకాశాన్ని కల్పిస్తూ ఆ తర్వాత కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించి వారిని సభ్యులుగా మారితే ఎక్కువ ఆడే అవకాశం ఉన్నట్టు వారికి ఆఫర్లు ప్రకటించడంతో, చాలా మంది వారి దగ్గరున్న మొత్తాన్ని చెల్లి చేస్తున్నారు.

క్రికెట్ లేక మరేదైనా అటకు సంబంధించి ఎంతో కొంత పరిజ్ఞానం ఉండడంతో చాలా మంది డబ్బులు సంపాదించుకోవచ్చన్న ఆశతో ఎంతోమంది ఈ ఊబిలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అనుభవజ్ఞులైన విశ్లేషకుల ద్వారా సూచనలు తీసుకోవడం కోసం వారికి సూచనలను ఇచ్చినందుకు ఎంతో కొంత మొత్తం చెల్లించడం లాంటి అనేక డబ్బు పోగొట్టుకునే కార్యక్రమాలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి వాటిపై దృష్టి పెట్టింది.

ఏపీలో డ్రీమ్ 11 యాప్ బ్యాన్…?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts