డ్ర‌గ్స్ కేసులో ర‌కుల్‌కు నోటీసులు?

September 23, 2020 at 5:53 pm

బాలీవుడ్ యువ కెర‌టం సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌డంతో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే సినీ తార‌ల చిట్టా మొత్తం బ‌య‌ట‌ప‌డుతోంది. దీంతో బాలీవుడ్‌తోపాటు ఇటు శాండిల్‌వుడ్, టాలీవుడ్‌‌లో డ‌గ్ర్ వ్య‌వ‌హారం కలకలం సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ఆమెను విచారించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈమెతో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దీపికా ప‌దుకొనే, సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌ల‌కు కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని అధికారులు ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు, డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ప్రచారాలను ఆపాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే.

డ్ర‌గ్స్ కేసులో ర‌కుల్‌కు నోటీసులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts