డ్రగ్స్ కేసు : నోటీసులు అందుకున్న స్టార్ జోడి..!

September 15, 2020 at 5:12 pm

డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం సినీ పరిశ్రమను ఊపేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శాండిల్ వుడ్ లో అయితే డ్రగ్స్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతూ వస్తోంది. ఇక ఇప్పటికే డ్రగ్స్ కేసులో శాండిల్వుడ్ కు చెందిన రాగిని, సంజన లు అరెస్టయిన విషయం తెలిసిందే. కాగా డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు… అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో రోజు రోజుకి కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటం సంచలనంగా మారిపోతుంది.

ఇటీవలే మరో స్టార్ జోడికి డ్రగ్స్ కేసులో అధికారులు నోటీసులు జారీ చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ జోడీగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న దిగంత్, అయింద్రిత కు నోటీసులు ఇచ్చారు అధికారులు. రేపు ఉదయం 11 గంటలకు వీరిని అధికారులు ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్ జోడికి డ్రగ్స్ కేసులో నోటీసులు అందడం సంచలనంగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగానే వీరికి అధికారులు నోటీసులు జారీ
చేసినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసు : నోటీసులు అందుకున్న స్టార్ జోడి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts