డ్రగ్స్ కేసు విచారణలో కన్నీటితో సమాధానం చెప్పిన స్టార్ హీరోయిన్..?

September 27, 2020 at 5:59 pm

సుశాంత్ కేసులో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ని అదుపులోకి తీసుకొని విచారించారు… ఆమె పర్సనల్ చాట్ లో పలువురు హీరోయిన్ల కు సంబంధించిన చాట్ గుర్తించి వారికి కూడా నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు పంపారు. ఇందులో భాగంగానే దీపికా పదుకొనే. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్ లకు నోటీసులు అందడం సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవలే డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందు విచారణకు హాజరు అయింది స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంది. సుశాంత్ మేనేజర్ తో చాటింగ్ చేయడం నిజమే అంటూ ఒప్పుకున్న దీపికాపదుకొనె… డ్రగ్స్ తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అధికారులు నోటీసులు ఇచ్చిన నలుగురు హీరోయిన్ల సెల్ఫోన్లు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

డ్రగ్స్ కేసు విచారణలో కన్నీటితో సమాధానం చెప్పిన స్టార్ హీరోయిన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts