చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ వ్య‌స‌నం.. ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

September 14, 2020 at 12:40 pm

గోర‌ఖ్‌పూర్ ఎంపీ ర‌వి కిష‌న్, న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ వ్య‌స‌నం విప‌రీతంగా పెరిగిపోయింద‌ని ఆరోపించ‌డం దుమారం రేపుతున్న‌ది. లోక్‌స‌భ‌లో డ్ర‌గ్స్ అంశంపై జీరో అవ‌ర్‌లో ఎంపీ ర‌వికిష‌న్ మాట్లాడారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌పై మాద‌క ద్ర‌వ్యాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. డ్ర‌గ్ స్మ‌గ్లింగ్‌, అడిక్ష‌న్ కేసులు పెరుగుతున్నాయ‌ని, దేశ యువ‌త‌ను నాశ‌నం చేసేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని, మ‌న పొరుగు దేశాలు డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌లో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాయ‌ని ర‌వి కిష‌న్ ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

అదీగాక‌ ప్ర‌తి సంవ‌త్స‌రం పాకిస్థాన్‌, చైనా నుంచి అధిక మొత్తంలో మాద‌క ద్ర‌వ్యాలు ఇండియాలోకి వ‌స్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. పంజాబ్‌, నేపాల్ స‌రిహద్దుల మీదుగా భార‌త్‌లోకి డ్ర‌గ్స్ ను త‌ర‌లిస్తున్నార‌ని వివ‌రించారు. మాద‌క ద్ర‌వ్యాల దందాకు పాల్ప‌డుతున్న‌వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, దోషుల‌ను క‌ట‌క‌టాల‌పాలు చేయాలని డిమాండ్ చేశారు. డ్ర‌గ్స్ స‌మ‌స్యలు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఉన్నాయ‌ని, గ‌తంలోనూ అనేక మందిని అరెస్టు చేశార‌ని గుర్తు చేశారు. ఎన్‌సీబీ మంచి ప‌నిచేస్తుంద‌ని ఎంపీ ప్ర‌శంస‌లు కురిపించారు. మాద‌క ద్ర‌వ్యాల దందాకు పాల్ప‌డుతున్న‌వారికి క‌ఠిన శిక్ష వేయాల‌ని, కుట్ర‌కు పాల్ప‌డుతున్న పొరుగు దేశాల ఆగ‌డాల‌ను ఆపాలని లోక్‌స‌భ‌లో ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఎంపీ చేసిన ఈ వ్యాఖ్య‌లు సినీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ వ్య‌స‌నం.. ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts