కొత్త‌దారుల్లో మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రా..?

September 23, 2020 at 6:36 am

డ్ర‌గ్స్ స్మ‌గ‌ర్లు రోజురో కొత్త‌దారిని వెదుకుతున్నారు. పోలీసుల క‌ళ్ల‌ను కప్పేందుకు ఎ‌ప్ప‌టిక‌ప్పుడు త‌మ రూటును మార్చుతున్నారు. ఈ విష‌యాల‌ను స్వయంగా ఎక్సైజ్‌శాఖనే అంగీకరించ‌డం ఇక్క‌డ కొస‌మెరుపు. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఆర్టీఐ ద్వారా ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) సంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎక్సైజ్‌శాఖ పలు విషయాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో అనేక మార్గాల్లో డ్రగ్స్‌ విక్రయాలు కొన‌సాగుతున్నాయ‌ని, ఈ వ్యవహారాలన్నీ విదేశీయులే నడిపిస్తున్నారని, ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేస్తే.. నేరుగా ఇంటికే స్పీడ్‌ పోస్టు ద్వారా మాదకద్రవ్యాలు చేర‌వేస్తున్నార‌ని వెల్ల‌డించ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్న‌ది. కొనుగోలుదారులు ఆర్డర్‌ చేసే డ్రగ్స్‌ గ్రాముల్లో ఉండడంతో వాటిని గుర్తించడం కష్టమని, విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఉత్తరాన్ని తనిఖీ చేయలేమ‌ని అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండ‌గా.. గుట్టుగా సాగుతున్న ఈ దందాను మరింత విస్తరించేందుకు విద్యార్థులను ఎంచుకున్నార‌ని పోలీసులు తెలుపుతుండ‌డం ఆందోళనను రేకెత్తిస్తున్న‌ది. డ్రగ్స్‌ విక్రయదారుల్లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు కూడా ఉన్నార‌ని ఎక్సైజ్ శాఖ తెల‌ప‌డం డ్ర‌గ్స్ స‌ప్ల‌య‌ర్ల ‌నెట్‌వర్క్‌ తీవ్రతకు నిద‌ర్శనం.

ఇంక ఇంగ్లండ్, జర్మనీల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ ఎక్కువ‌గా నేరుగా ఇంటికే చేరుతున్నాయన్న విషయం కూడా వెల్లడైంద‌ని, స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డీలను భారత్‌కు దిగుమతి చేస్తున్న‌ట్లు గుర్తించామ‌ని, అదే సమయంలో సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని ఓ ఫార్మాలో డ్రగ్స్‌ ఉన్నట్లు క‌నుగొన్న‌ట్లు అధికారులు తెలిపారు. అయితే నిందితుల్లో ఎక్కువ శాతం పలుకు బడి కలిగిన రాజకీయ, సంప న్న కుటుంబాల వారే కావ‌డంతో డ్రగ్స్‌ కేసుల విచారణలో ఎక్సై జ్‌ శాఖ లోతుగా వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2017లో సినిమా పరిశ్రమలో డ్రగ్స్‌ కల్లోలం చెలరేగ‌గా ఆ కేసులో 60 మంది పేర్లు జాబితాలో పొందుపరిచిన అధికారులు, కేవ‌లం 12 మంది సినీ ప్రముఖులనే గుర్తించ‌డం అందుకు నిద‌ర్శనం. ప్ర‌స్తుతం తాజాగా ఇటు శాండ‌ల్ వుడ్‌, బాలివుడ్‌లోనూ డ్ర‌గ్స్ క‌ల‌కలం చెరేగింది. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసు విచార‌ణ‌లో భాగంగా ఈ సంబంధాలు వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఈ కేసు ఏమ‌వుతుందో చూడాలి మ‌రి.

కొత్త‌దారుల్లో మాద‌క‌ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts