ఎందుకంత వెనుక పడ్డారూ.. కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్.?

September 24, 2020 at 2:53 pm

కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఎందుకు తగిన స్థాయిలో టెస్టులు చేయడం లేదు అంటూ ప్రశ్నించింది. కరోనా టెస్టులు అమాంతంగా ఎందుకు తగ్గించారు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ రోజుకు లక్షన్నర కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అంటూ తెలిపిన తెలంగాణ హైకోర్టు… గతంలో హైకోర్టు ప్రశ్నించిన సమయంలో రోజుకు 40 వేల టెస్టులు చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఎందుకు చేయడం లేదు ప్రశ్నించింది . కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను ఎందుకు తగ్గించిందో వివరణ ఇవ్వాలని కోరింది. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఎందుకు బెడ్లు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని కోరిన హైకోర్టు.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎందుకు వెనుకబడింది అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

ఎందుకంత వెనుక పడ్డారూ.. కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts