ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరో..?

September 20, 2020 at 3:18 pm

కరోనా వైరస్ ప్రభావమా లేకపోతే మరి ఇంకేదైనా విశేషమా తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. మొన్నటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అందరు హీరోలు ప్రస్తుతం ఓ ఇంటివాళ్లు అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎప్పుడు డీసెంట్ గా కనిపించే నితిన్ లవ్ స్టోరీ గురించి బయట పెట్టి తన ప్రియసఖిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు. అంతలోనే యువ హీరో నిఖిల్ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా… ప్రేమ విషయం చెప్పడం అందరూ మాట్లాడుకోవడం పెళ్ళి జరగడం చకచకా జరిగిపోయింది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న తరుణ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం కాబోయే భార్య కుటుంబాలతో లాంఛనాలు మాట్లాడుకుంటున్నారట . త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తరుణ్ అభిమానులూ మురిసిపోతున్నారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts