కోడ‌లికి నిద్ర‌మాత్ర‌లిచ్చి రేప్‌

September 24, 2020 at 11:54 am

సామాజంలో నైతిక విలువ‌లు ప‌డిపోతున్నాయి. శారీర‌క సుఖాల కోసం ఎంత‌టి నీచానికైనా దిగుతున్నారు. వావీవర‌సుల‌ను మ‌ర‌చి ప‌శువులుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఓ మామ కూతురిలా చూసుకోవాల్సిన కోడ‌లిపైనే క‌న్నేశాడు. అదును చూసుకుని నిద్ర‌మాత్ర‌లిచ్చి మ‌రీ కోడల‌ని రేప్ చేయ‌డం స‌భ్య‌స‌మాజానికి త‌ల‌వంపులు తీసుకొచ్చాడు. అక్క‌డితో ఆగ‌కుండా అటుత‌రువాత బ్లాక్ మెయిల్ దిగి ఆమెను గర్భవతిని చేయ‌డం ఆ కామంధుడి నీచ‌బుద్ధికి ప‌రాకాష్ట‌. ఈ ఘ‌ట‌న‌ నోయిడాలో వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..నోయిడా ప‌రిధిలోని చప్రోలీ ప్రాంతానికి మున్నీలాల్ భార్య కొన్నేళ్ల క్రిత‌మే మ‌ర‌ణించింది. దీంతో అప్ప‌టి నుంచి తన కుమారుడు మ‌ధుర్‌, కోడ‌లితో క‌లిసి నివ‌సిస్తున్నాడు. మ‌ధుర్ వ్యాపార ప‌నుల నిమిత్తం ఢిల్లీలోనే నివాస‌ముంటు వారానికి ఒక సారి మాత్రమే వస్తూ పోతుండేవాడు.

ఇదిలా ఉండ‌గా అయితే మామ మున్నీలాల్ క‌న్ను కోడలిపై ప‌డింది. కామ‌కోరిక‌ల‌ను తీర్చుకోవాలనుకుని త‌న ఆలోచ‌న‌ల‌ను ప‌దునెపెట్టాడు. అంతే కోడలికి ఓ రోజు పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె మ‌త్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. స్పృహ‌లోకి వ‌చ్చాక ఈ విషయం తెలుసుకున్న కోడ‌లు మామను నిలదీసింది. అయితే విష‌యాన్ని గుట్టుగా ఉంచాల‌ని, బ‌య‌ట‌పెడితే తన కొడుకు మధుర్ కు చెప్పి ఇంట్లోంచి గెంటివేయించేస్తానని బెదిరించాడు. అంతేకాదు ఇలాగే ఎప్ప‌టికీ త‌న కోరికలు తీర్చాలని పట్టుబట్టాడు. నాటి నుంచి కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలిపై అత్యాచారం చేయ‌డం మొద‌లుపెట్టాడు. ఈ క్ర‌మంలో కోడ‌లు గర్భవతి అయ్యింది. అప్ప‌టికే తండ్రి చేస్తున్న పనులపై అనుమానం కలిగిన మధుర్‌కు ఈ విష‌యం మ‌రింత బ‌లాన్ని ఇచ్చింది. భార్య‌ను నిల‌దీయ‌గా జ‌రిగిన విష‌యం మొత్తాన్ని చెప్పి బోరుమ‌న్న‌ది. ఇంకేముంది తండ్రిని నిలదీయాల‌ని ప్ర‌య‌త్నించ‌గా మున్నీలాల్ ఇంట్లోంచి పరారయ్యాడు. అదీగాక ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపుల‌కు దిగ‌డం కొస‌మెరుపు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు మున్నీలాల్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తును చేప‌డుతున్నారు.

కోడ‌లికి నిద్ర‌మాత్ర‌లిచ్చి రేప్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts