ప్రాణ భయం: ఒక‌వైపు పాము, మ‌రోవైపు కొండ‌చిలువ మ‌ధ్య‌లో ఓ వ్య‌క్తి..!

September 24, 2020 at 7:54 pm

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఇక పాముకు సంబంధించిన‌వి సోష‌ల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు మాత్రమే అందరిని ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోల్లో ఒక్కటి ఈ వీడియో. అయితే ఈ వీడియోను అర్థం చేసుకోవ‌డానికి కాస్త క‌ష్టంగానే ఉంది. ఒక్కొక్క‌రికీ ఒక్కో కోణంలో అర్థ‌మ‌వుతుంది. మ‌రి మీకు ఈ వీడియో చూసి ఏం అర్థ‌మైందో చెప్పండి. ఒక వ్య‌క్తి న‌ల్ల‌టి స్టైడ్ (నీటి కొల‌ను) అంచున నిల‌బ‌డి ఉన్నాడు. అత‌ను నిలుచున్న ప్ర‌దేశం చాలా ఇరుగ్గా ఉంటుంది. చివ‌ర‌ నిల్చున్న అత‌నికి పాము నీటిలో మునిగిపోవ‌డం క‌నిపించింది.

అతను వెంట‌నే దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లి చేతితో ప‌ట్టుకొని గ‌ట్టున వేశాడు. ప‌ట్టుకునేటప్పుడు ధైర్యంగానే ప‌ట్టుకున్నాడు కాని గ‌ట్టున వేయ‌గానే దాన్ని చూసి గ‌జ‌గ‌జ వ‌ణికిపోయాడు. ఈ స‌మ‌యంలోనే ప‌క్క‌నే ఎత్తుగా ఉన్న టెంట్ నుంచి కొండ‌చిలువ కింద‌కు జారి ఇత‌ని మీద ప‌డ‌బోయింది. పైథాన్‌ను చూడ‌గానే భ‌య‌ప‌డి ఆ వ్య‌క్తి నీటిలో ప‌డిపోయాడు. త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఒక పామును ఎందుకు కాపాడాడు. కొండ‌చిలువ బారిన ఎందుకు ప‌డ్డాడు అని అర్థంకాక అంద‌రూ జుట్టుపీక్కుంటున్నారు.

ప్రాణ భయం: ఒక‌వైపు పాము, మ‌రోవైపు కొండ‌చిలువ మ‌ధ్య‌లో ఓ వ్య‌క్తి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts