రియా చక్రవర్తి జీవితంపై బయోపిక్.. చిత్ర నిర్మాతల ఆసక్తి?

September 28, 2020 at 10:53 am

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసులు ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా చ‌క్ర‌వ‌ర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు అధికారులు. దీంతో రియా చ‌క్ర‌వ‌ర్తి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి ఓ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉంటున్న రియా చక్రవర్తి జీవితంపై బయోపిక్ నిర్మించేందుకు పలువురు చిత్ర నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా.. రియా చక్రవర్తి సినీరంగప్రవేశం నాటి నుంచి సుశాంత్ సింగ్ ప్రేమలో పడిన ఘటనలు, అరెస్టు అయిన ఘ‌ట‌న‌లు సేకరించే పనిలో చిత్ర నిర్మాతలు పడ్డారని స‌మాచారం.

అంతేకాదు, ఆమె వ్యక్తిగత జీవితం బయోపిక్‌తో పాటు ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఒక ప్రచురణ సంస్థ నటి చెప్పే విష‌యాల‌ను పుస్త‌కంగా తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ట‌. ఈ మేర‌కు ఆమెతో కాంట్రాక్టు కుదర్చుకుందని సమాచారం. ఏదేమైనా.. సుశాంత్ మృతి అనంతరం రియా చక్రవర్తి త‌ర‌చూ వార్తల్లో నిల‌వ‌డంతో.. ఆమె బ‌యోపిక్‌పై చిత్ర నిర్మాత‌ల‌కు ఆస‌క్తి పెరిగింద‌ని చెప్పాలి.

రియా చక్రవర్తి జీవితంపై బయోపిక్.. చిత్ర నిర్మాతల ఆసక్తి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts