ఆహార నిల్వలపై కరోనా.. చైనా కి మరో షాక్..?

September 25, 2020 at 3:23 pm

చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం అక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచ దేశాలలో మాత్రం అల్లకల్లోలం సృష్టిస్తుంది. అయితే చైనాలో కరోనా వైరస్ ఎలా కట్టడి అయిందో తెలియదు కానీ మళ్ళీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగకుండా మాత్రం అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అయితే ఇటీవలే మరో సారి చైనాలో కరోనా కలకలం సృష్టించింది.

సీఫుడ్ ప్యాకెట్లపై కరోనా వైరస్ ను అక్కడి అధికారులు గుర్తించారు. ఇటీవలే చైనా తూర్పు నగరమైన కింగ్ డావోలో సీ ఫుడ్ నీ దిగుమతిదారులు నిల్వ ఉంచారు. ఆరోగ్య శాఖ అధికారులు వాటిపై ఉన్న నమూనాలను సేకరించి పరీక్షించగా అక్కడ కరోనా నమూనాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో దిగుమతి ప్రక్రియ లో పాల్గొన్న అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారికి నెగిటివ్ అని వచ్చింది. అయితే ఇలా దిగుమతి చేసే ఆహార ప్యాకెట్లను నాలుగు వారాల పాటు నిలువ ఉంచిన తర్వాతనే… వాడుక లోకి తీసుకు రావాలి అంటే అధికారులు కఠిన నిబంధనలు విధించారు.

ఆహార నిల్వలపై కరోనా.. చైనా కి మరో షాక్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts