కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి!

September 27, 2020 at 10:11 am

కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత జశ్వంత్‌ సింగ్ మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. 1938లో రాజస్థాన్‌లో జన్మించిన జశ్వంత్‌ సింగ్.. వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా కొనసాగారు.

జశ్వంత్‌ సింగ్‌ సొంత ప్రాంతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్. ఆయన‌ 1950లో ఆర్మీలో చేరి.. ఆర్మీ అధికారిగా సేవలందించారు. రిటైర్మెంట్ తరువాత బీజేపీలో చేరిన ఆయన 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. ఐదుసార్లు రాజ్యసభ, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

కాగా, జ‌శ్వంత్ సింగ్ మృతిపట్ల ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఓ సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని మోదీ కొనియాడారు.

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts