బాలయ్య పాటకు గంగ‌వ్వ ఊర‌మాస్ స్టెప్పులు!

September 21, 2020 at 8:53 am

బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్రారంభై రెండు వారాలు గ‌డిచింది. మొద‌టి వారం ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ కాగా.. రెండో వారం క‌రాటె కళ్యాణి దుకాణం సద్దేసింది. ఇక నిన్నటి‌ ఎపిసోడ్‌లో రెండో హౌజ్‌మేట్ నామినేషన్ ప్రక్రియ సాగింది. మొదట కళ్యాణిని సాగనంపే కార్యక్రమం తరవాత మిగిలిన ఏడుగురిలో ఎలిమినేట్ అయ్యేదెవరో చెప్పే ప్రక్రియలో నాగార్జున ఇంటి స‌భ్యుల‌తో ఎన్నో ఆట‌లు ఆడించి సంద‌డి చేశారు.

ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్యుల‌తో నాగార్జున డాగ్‌ అండ్‌ బోన్‌ గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో ఇద్దరు చొప్పున హౌజ్‌మేట్స్‌ను ఎంపిక చేసి.. వారు బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయాలని నాగార్జున సూచించారు. పాట ఆగిన వెంటనే ఎవరైతే బోన్ తీసుకుంటారో వాళ్లు విన్నర్. అయితే ఈ గేమ్‌లో గంగవ్వ పాల్గొని అదిరిపోయే స్టెప్పులు వేశారు.

ఈ గేమ్‌లో కుమార్‌ సాయి, గంగవ్వ పోటీ పడ్డారు. బాలయ్య పైసా వసూల్ సినిమాలోని టైటిల్ సాంగ్‌ పెట్టగా.. వారిద్దరు బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేశారు. ఈ క్ర‌మంలోనే గంగవ్వ నాలుక మడతపెట్టి మ‌రీ కుమార్ సాయితో పోటీగా ఉర‌మాస్ స్టెప్పులేశారు. అంతేకాదు ఆఖరులో ఆ బోన్‌ని తీసుకొని కుమార్ సాయిని పరుగులు పెట్టించారు. ఇక గంగ‌వ్వ ఎన‌ర్జీకి ఇంటి స‌భ్యుల‌తో పాటు నాగ‌ర్జున సైతం ఎంతో ఖుషీ అయ్యారు.

బాలయ్య పాటకు గంగ‌వ్వ ఊర‌మాస్ స్టెప్పులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts