మోనాల్, అఖిల్ మ‌ధ్య పుల్ల‌లు పెట్టేస్తున్న గంగ‌వ్వ‌?

September 27, 2020 at 10:02 am

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్.. మూడో వారం పూర్తి చేసుకుంది. మొద‌టి రెండు వారాల‌తో పోల్చుకుంటే.. మూడో వారం కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారింద‌నే చెప్పాలి. ఇక మూడో వారంలో మోస్ట్ స్పెష‌ల్ కంటెస్టెంట్ గంగ‌వ్వ చెల‌రేగిపోయింద‌ని చెప్పాలి. ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్‌, అఖిల్ మ‌ధ్య పుల్ల‌లు పెట్టే ప్ర‌య‌త్నిం చేసింది గంగ‌వ్వ‌.

శుక్రువారం ఎపిసోడ్‌లో అఖిల్‌ను అభి అని మోనాల్ పిల‌వ‌డంతో.. అఖిల్ బాగా ఫీల్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే మోనాల్‌తో కాసేపు మాట్లాడ‌టం మానేశారు అఖిల్‌. ఈ విష‌యాన్ని శ‌నివారం గుర్తు చేసిన గంగ‌వ్వ‌.. నీతో మాట్లాడకని అఖిల్‌కి నేనే చెప్పాను అంటూ మోనాల్‌కి చెప్పింది. అయితే గంగ‌వ్వ మాట‌లు నిజమని నమ్మి మోనాల్ క‌న్నీరు పెట్టుకుంది. మోనాల్ ఏడ‌వ‌డంతో.. ఊరికే అన్నానని ఆ తరువాత ఆమె‌ని బుజ్జగించింది.

ఇక ఇదే ఎపిసోడ్‌లో అఖిల్‌ని తన దత్తపుత్రుడిగా స్వీకరిస్తానని గంగవ్వ లాస్య‌తో చెప్పింది. మరి అతడికి భార్యగా ఆమె వద్దా అంటూ లాస్య, మోనాల్‌వైపు చూపించగా.. ఛీ, ఇక్కడున్న వాళ్లు ఎవరూ వద్దు అంటూ తేల్చి చెప్పింది. ఏదేమైనా దీని బ‌ట్టీ చూస్తుంటే.. అఖిల్‌, మోనాల్‌లు కలిసి ఉండటం గంగ‌వ్వ‌కు పెద్ద‌గా న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది.

మోనాల్, అఖిల్ మ‌ధ్య పుల్ల‌లు పెట్టేస్తున్న గంగ‌వ్వ‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts