జిహెచ్ఎంసి ఎలక్షన్స్.. అదంతా అబద్ధం అంటున్నా కేటీఆర్..?

September 30, 2020 at 3:21 pm

జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నవంబర్ 11 తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పలేదు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని… అన్ని పార్టీలు సంసిద్ధంగా ఉండాలి అని మాత్రమే తాను చెప్పాను అంటూ తెలిపారు కేటీఆర్. కానీ కొన్ని మీడియాలు మాత్రం తాను నవంబర్ 11 తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ తాను చెప్పినట్లు ప్రతిపాదించడం సరైనది కాదు అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే నవంబర్ రెండవ వారం తర్వాత ఎప్పుడైనా జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని… అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని తెలిపిన కేటీఆర్… తమ పార్టీ ఈసారి కూడా అత్యధిక సీట్లు గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. కానీ మీడియాలో నవంబర్ 11 తర్వాత ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ చెప్పినట్లుగా వార్తలు రావడంతో వెంటనే స్పందించిన కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

జిహెచ్ఎంసి ఎలక్షన్స్.. అదంతా అబద్ధం అంటున్నా కేటీఆర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts