ఘోరం: రోడ్డుపై ప్రత్యక్షమైన పసికందు..!

September 30, 2020 at 5:29 pm

తల్లి పొత్తి కడుపులో సేద తీరాల్సిన ఆ పసికందు నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. తల్లి ఒడిలో ఊయలు ఊగాల్సిన బిడ్డ సంచిలో దిక్కులేనిదానిలా నడిరోడ్డుపై బోరున విలపిస్తోంది. సంచిలో గుక్కపట్టి ఏడుస్తున్న ఆ పసికందును చూసిన స్థానికులు స్పందించడంతో ఆ పసికందు ప్రాణాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ శివారులోని వంకబావి రోడ్డులో అప్పుడే పుట్టిన శిశువు బోరున విలిపిస్తూ కనిపించింది.

గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో ఆడశిశువును వదిలి వెళ్లిపోయారు. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు పసికందు ఏడ్పును గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాపను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. పసికందును ఎవరు రోడ్డుపై వదిలి వెళ్లారు….ఆడపిల్ల కావడంతో వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఘోరం: రోడ్డుపై ప్రత్యక్షమైన పసికందు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts