బంగారం అతి చౌక ధరల్లో… ఎక్కడో తెలుసా..?

September 22, 2020 at 11:45 am

కొవిడ్‌ నిరోధానికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు తోడు అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడం వల్ల బంగారం స్మగ్లింగ్‌ గణనీయంగా తగ్గింది. గతేడాది దేశంలోకి 120 టన్నుల బంగారం దొంగచాటుగా దిగుమతి కాగా, ఈ ఏడాది నెలకు 2 టన్నుల చొప్పున ఏడాది మొత్తంమీద 25 టన్నులకే పరిమితం అవుతుందనే అంచనా ఉందని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ దేశీయ మండలి ఛైర్మన్‌ ఎన్‌.

అనంత పద్మనాభన్‌ పేర్కొన్నారు మార్చి ఆఖరు నుంచి జూన్‌ వరకు అంతర్జాతీయ విమానాలు నిలిచిపోవడంతో పసిడి అక్రమార్కులకు మార్గాలు స్తంభించాయి.ఇక ఆభరణాల దుకాణాలు కూడా మూసివేయడంతో, దేశీయంగా గిరాకీ లేదు. ఇక నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ నుంచి కొద్దిమొత్తాల్లో మాత్రమే నేల, నీటి మార్గాల్లో బంగారం దొంగచాటుగా దేశంలోకి వస్తోందని భావిస్తున్నారు. అయితే బంగారంపై దిగుమతి సుంకాన్ని శ్రీలంక తాజాగా రద్దుచేయడం వల్ల, అక్కడినుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్‌ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బంగారం అతి చౌక ధరల్లో… ఎక్కడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts