మందుబాబులకు గుడ్ న్యూస్..!

September 25, 2020 at 6:41 pm

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా థియేటర్లు, బారులు, క్లబ్ లు అన్ని మూతపడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో బార్‌లు, క్లబ్‌లు, టూరిజం బార్‌లు తెరుచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలకు లోబడి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రభుత్వం జారీ చేసిన నిబంధలను వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు. ఇక నిబంధనలు బార్‌లు,క్లబ్‌లు,టూరిజం బార్‌లకు కూడ వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

ఇక బార్‌లు, క్లబ్‌లలో ప్రవేశ ద్వారం వద్దనే కస్టమర్లకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక లోపలికి వెళ్లేప్పుడు తప్పని సరిగా క్యూ పద్దతిని పాటించాలన్నారు. బార్‌ నిర్వాహకులు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపారు. అంతేకాదు బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర మూగడం, మ్యూజిక్‌ కార్యక్రమాలు, డాన్స్‌ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయడం వంటివి నిషేధించారు. ఇక కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్ ‌లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయాల్సి వుంటుందని తెలిపారు.

మందుబాబులకు గుడ్ న్యూస్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts