గుడ్ న్యూస్ : ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గింపు..!

September 17, 2020 at 7:10 pm

ప్రస్తుతం శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థల నిర్వహణ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికీ కరోనా ప్రభావం దృశ్య కొన్ని పరీక్షలను రద్దు చేయగా మరి కొన్ని పరీక్షలను కఠిన నిబంధనల మధ్య జరుగుతున్నాయి. ఇక నూతన విద్యా సంవత్సరం విషయంలో కూడా ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య విద్యార్థులందరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సిలబస్ 30 శాతం వరకు తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ముఖ్య కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించిందని… అయితే సీబీఎస్సీ ఏ సిలబస్ అయితే తగ్గించిందో తాము కూడా అదే సిలబస్ తొలగిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

గుడ్ న్యూస్ : ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గింపు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts