గొప్ప మనసు చాటుకున్న టీచర్.. ఏం చేసిందో తెలుసా..?

September 17, 2020 at 7:27 pm

కరోనా సంక్షోభం సమయంలో ఎంతో మంది సామాన్య ప్రజలు సైతం తమ పెద్దమనసు చాటుకుంటూ ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తమకు ఉన్నంతలో సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఎంతమంది. ఇక్కడ ఓ టీచర్ కూడా ఎంతో గొప్ప పని చేసింది. ఎంతో గొప్పదైనా టీచర్ వృత్తిలో… అంతకు మించిన గొప్ప పని చేసింది ఆ టీచర్. విద్యార్థులకు పాఠాలు చెప్పి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాదు ఏకంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కూడా సిద్ధమైంది.

కరోనా సంక్షోభం సమయంలో ఒక గొప్ప పని చేసింది ఇక్కడ ఒక టీచర్. తన పెళ్లి వేదికనే రక్తదాన శిబిరం గా మార్చేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన నూర్జహాన్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఇటీవల తోటి ఉపాధ్యాయుడితో తనకు పెళ్లి నిశ్చయమైంది. ఇంతలో ఎంతో గొప్పగా ఆలోచించింది సదరు టీచర్. కరోనా సంక్షోభం సమయంలో రక్తం కొరత ఏర్పడుతున్న విషయాన్ని తెలుసుకున్న నూర్జహాన్ ఏకంగా పెళ్లి వేదికనే రక్తదాన శిబిరం గా మార్చేసింది. ఏకంగా పెళ్లికి హాజరైన 32 మంది బంధువులతో రక్తదానం చేయించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది ఆ టీచర్.

గొప్ప మనసు చాటుకున్న టీచర్.. ఏం చేసిందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts