గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన యువ హీరో..?

September 27, 2020 at 5:52 pm

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా లో భాగంగా సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటగా తాజాగా సినీ హీరో రాజ్ తరుణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి.. గచ్చిబౌలి లో మొక్కలు నాటాడు యువ హీరో రాజశేఖర్.

అంతే కాకుండా మొక్కలు నాటిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ తెలిపిన రాజ్ తరుణ్.. ఎంతో గొప్పది అయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తాను కూడా ఒక భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినీ హీరోయిన్ హేమల్, ఆర్టిస్ట్ మధునందన్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు రాజ్ తరుణ్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన యువ హీరో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts