బిగ్‌బాస్ హౌస్‌లో నేడు బిగ్ ట్విస్ట్‌?

September 25, 2020 at 3:52 pm

బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఇటీవ‌ల ప్రారంభ‌మై.. మూడో వారం జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి రెండు వారాల క‌న్నా.. మూడో వారం బిగ్ బాస్ హౌస్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన ఉక్కు హృదయం టాస్క్.. ఇంటి స‌భ్యులు రోబోలు, మ‌నుషులుగా విడిపోయి.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇక ఎలాగోలా చివ‌ర‌కు రోబోలు టాస్క్‌లో విజేత‌లుగా గెలుపొందారు.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఇప్పటికే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టారు. అయితే ఇవాళ మరొకరిని హౌజ్‌లోకి పంపబోతున్నట్లు నిన్నటి ప్రోమోలో చూపించారు. దీంతో అంద‌రూ మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ అని ఫిక్స్ అయిపోయారు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ స్వాతి దీక్షిత్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో అడుగుపెడుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇలాంటి త‌రుణంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

వచ్చిన కంటెస్టెంట్‌ అతిథిగా వచ్చారా..? లేక కొత్త కంటెస్టెంట్‌గా వచ్చారా..? చూడండి అంటూ ఓ ప్రోమోను విడుదల చేశారు. దానికి తోడు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్‌ వెంట లగేజీ లేకపోవడంతో గెస్ట్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీనే అని అంటున్నారు మ‌రికొంద‌రు. అయితే మ‌రి ఆమె గెస్ట్‌నా లేక కొత్త కంటెస్టెంట్‌నా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

బిగ్‌బాస్ హౌస్‌లో నేడు బిగ్ ట్విస్ట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts