హైకోర్టు పై కరోనా పంజా.. జడ్జి కీలక నిర్ణయం..?

September 21, 2020 at 7:00 pm

ప్రస్తుతం కరోనా వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం అదే రేంజ్ లో కొనసాగుతోంది. ఇక రోజు రోజుకు ప్రజల్లోనే కాదు అధికారుల్లో కూడా భయం నెలకొంటుంది. ఇప్పటికే సామాన్య ప్రజలనే కాదు అధికారులను ప్రజా ప్రతినిధులపై సైతం ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతుంది.

ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం సృష్టిస్తు ఏకంగా కార్యాలయాలు మూసివేసే పరిస్థితి కూడా తీసుకొస్తుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒడిశా హైకోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. హైకోర్టులో వివిధ విభాగాల్లో పని చేసే పలువురు సిబ్బందికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో హైకోర్టు లోని మిగతా సిబ్బంది లో కరోనా భయం మొదలైంది. కరోనా వెలుగులోకి రావడంతో హైకోర్టును ఒక రోజు పాటు మూసివేసి శానిటైజ్ చేసి.. తర్వాత రోజు ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

హైకోర్టు పై కరోనా పంజా.. జడ్జి కీలక నిర్ణయం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts