ప్ర‌భాస్‌కు త‌మ్ముడిగా ఆ యంగ్ హీరో ఫిక్స్‌?

September 14, 2020 at 9:58 am

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. ఇక త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసేందుకు ప్లాన్స్ చేస్తోందట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో తమిళ్ యంగ్ హీరో అథర్వా మురళి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని.. అథర్వా, ప్రభాస్ కి తమ్ముడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

Producer files cheating complaint against actor Atharvaa : Cine Observer

హీరో అథర్వా `గద్దలకొండ గణేష్` చిత్రంలో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి రాధే శ్యామ్ లో ప్ర‌భాస్‌కు త‌మ్ముడిగా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి. కాగా, ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఆదిపురుష్ పేరుతో ఓ భారీ బ‌డ్జెట్‌ సినిమాను కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్‌కు త‌మ్ముడిగా ఆ యంగ్ హీరో ఫిక్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts