అయ్యో.. పాయల్ కు ఎంత క‌ష్టం వ‌చ్చి ప‌డింది?

September 18, 2020 at 10:56 am

పాయల్ రాజ్ పూత్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ చిత్రం త‌ర్వాత ఆర్.డి.ఎక్స్‌ లవ్, వెంకీ మామ, డిస్కోరాజా వంటి సినిమాల్లో నటించింది పాయ‌ల్‌.

ఆ మూడు చిత్రాల్లో వెంకీ మామ హిట్ అయినా.. పాయ‌ల్ పాత్ర‌కు పెద్దగా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తేలేదు. ఇక ఆపై ఆమెకు తెలుగులో ఆశించిన అవకాశాలు కూడా రాలేదు. ఇక అవ‌కాశాల విష‌యం ప‌క్క‌న పెడితే.. పాయ‌ల్‌కు మ‌రో క‌ష్టం వ‌చ్చి ప‌డింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న పాయ‌ల్‌.. వర్కౌట్స్ ను మర్చి పోవడంతో 58.5 కేజీలు ఉన్న ఆమె ఏకంగా 62 కేజీల బరువు పెరిగిందట.

దీంతో మునుపటి వెయిట్ కు రావ‌డం కోసం నానా ప్ర‌యత్నాలు చేస్తున్నాన‌ని బాహాటంగానే చెప్పేసింది పాయ‌ల్. కాగా, ప్ర‌స్తుతం జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నరేంద్ర’ అనే సినిమాలో పాయల్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె స్వ‌యంగా మొదటి సారి తెలుగులో డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది.

అయ్యో.. పాయల్ కు ఎంత క‌ష్టం వ‌చ్చి ప‌డింది?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts