నా భ‌ర్త హోమో సెక్సువ‌ల్‌.. వీకెండ్‌లో మ‌గాళ్ల‌తో రాస‌లీలు

September 21, 2020 at 7:07 pm

పెండ్లి అనేది జీవితంలో ఒక భాగం. అది ప్ర‌తి మ‌నిషికీ మ‌ర‌చిపోలేని మ‌ధుర‌జ్ఞాప‌కం. అలాంటి ఎన్నో ఊహ‌ల‌తో, మ‌రెన్నో ఆశ‌ల‌తో అత్త‌వారింట్లో అడుగుపెట్టింది ఆ అమ్మాయి. ఏడాదిపాటు స‌వ్యంగానే సాగింది వారి కాపురం. అటు త‌రువాత ఆ ప్ర‌బ‌ద్ధుడికి ఏమోచ్చిందో ఏమో హోమో సెక్సువ‌ల్‌గా మారిపోయాడు. ఈ విష‌యం తెలిసి స‌ద‌రు భార్యామ‌ణి కంగుతున్న‌ది. విష‌యాన్ని అత్త‌వారి బంధువుల‌కు తెలిపింది. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇక చేసేదేమీ లేక నేరుగా భ‌ర్త‌ను నిల‌దీసింది. అంతే గుట్టు ర‌ట్ట‌యింద‌ని భావించిన ఆ భ‌ర్త ఈ విషయాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు దిగుతూ వేధింపుల‌కు గురిచేయ‌డం మొద‌లుపెట్టాడు. చివ‌రికి వాటిని త‌ట్టుకోలేక పోలీసుల‌ను ఆశ్ర‌యించి త‌న గోడు వెల్ల‌బోసుకుంది. ఈ సంఘ‌ట‌న గుజరాత్ రాష్ట్రం ఆహ్మాదాబాద్‌లో వెల‌గుచూసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

గుజరాత్ లోని గాంధీనగర్ కు చెందిన ఓ మహిళ స్థానికంగా లైబ్రేరియన్ గా పని చేస్తున్న‌‌ది. 2018లో పెద్ద‌లు చూసిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న‌ది. వారి దాంప‌త్య జీవితం ఏడాది పాటు స‌జావుగానే సాగింది. ఇటీవ‌ల‌ కొన్ని రోజుల నుంచి భర్త ప్ర‌వ‌ర్త‌న‌ల‌తో తేడా క‌నిపించింది. ఇదే అనుమానంతో భ‌ర్త‌ వాట్సాప్ ను పరిశీలించి అస‌లు విష‌యం తెలిసి కంగుతిన్న‌ది. పురుషులతో సన్నిహితంగా మెలిగుతున్నాడ‌ని, హోమో సెక్సువ‌ల్‌గా మారాడ‌ని గ్ర‌హించి ఆ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయింది. అంతే నేరుగా భ‌ర్త‌నే నిలదీసింది. అయితే త‌న గుట్టు ర‌ట్ట‌యింద‌ని స‌ద‌రు భ‌ర్త ఈ సంగతి బ‌య‌ట‌కు చెబితే చంపేస్తానని, తన లైంగిక జీవితం తన ఇష్టమని బెదిరించ‌డ‌మేకాదు… నాటి నుంచి ఆమెను వేధింపుల‌కు గురిచేయ‌డం మొద‌లుపెట్టాడు. విష‌యాన్ని అత్తింటివారికి తెలిపినా ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో చేసేదేమీలేక పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న భ‌ర్త‌కు పురుషుల పట్ల లైంగికాసక్తి ఎక్కువని, తన భర్తకు ఓ వాట్సప్ గ్రూపు ఉందని, అందులోని మెంబర్స్ తో లైంగిక సంబంధాలున్నాయని, వారంతా వీకెండ్స్ లో పార్టీలు చేసుకుంటూ, లైంగిక వాంఛలు తీర్చుకునే వారని పోలీసుల‌కు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో పోలీసులు స‌ద‌రు భ‌ర్త‌పై గృహహింస కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నా భ‌ర్త హోమో సెక్సువ‌ల్‌.. వీకెండ్‌లో మ‌గాళ్ల‌తో రాస‌లీలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts