తెలంగాణ‌లో మ‌రో ప‌రువుహ‌త్య‌

September 25, 2020 at 11:19 am

తెలంగాణ‌లో ప్ర‌ణ‌య్‌, అమృత‌ల విషాద ప్రేమ‌గాథ‌ను మ‌రువ‌క‌ముందే మ‌‌రోప‌రువు హ‌త్య శుక్ర‌వారం ఉద‌యం వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతున్న‌ది. కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కుడిని కిరాయి గుండాల‌తో హ‌త్య చేయించ‌డం క‌ల‌కలం రేపుతున్న‌ది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. హైద‌రాబాద్ చందాన‌గ‌ర్‌లో నివాస‌ముండే హేమంత్ అనే యువ‌కుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాలు వేరుకావ‌డంతో యువ‌తి తండ్రి వారిపై క‌క్ష పెంచుకున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే హేమంత్‌పై యువ‌తి తండ్రి, బంధువులు క‌క్ష పెంచుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కిరాయి గుండాల‌తో యువ‌కుడిని కిడ్నాప్ చేయించి సంగారెడ్డిలో హ‌త్య చేయించిన‌ట్లు తెలుస్తున్న‌ది. గురువారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు వ‌చ్చి త‌మ‌ను బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లార‌ని, మార్గ‌మ‌ధ్య‌లో అర‌వ‌డంతో త‌న‌ను అక్క‌డే దించార‌ని, హేమంత్‌ను మాత్రం అలాగే కారులో తీసుకెళ్లార‌ని అత‌ని భార్య అవంతి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వెంట‌నే అత్త‌మామ‌ల‌కు ఫోన్ చేసి వారితో పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నామ‌న్నారు. ఠాణాలో ఫిర్యాదు చేయ‌గా అధికారులు వెంట‌నే గాలింపు చేప‌ట్టారు. ఎక్క‌డ అచూకీ ల‌భించ‌లేదు. ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం ఉద‌యం సంగారెడ్డి శివారులో హేమంత్ మృత‌దేహం ల‌భ్యం కావ‌డం సంచ‌ల‌నం రేపింది. త‌న తండ్రి, మేన‌మామ‌నే హేమంత్‌ను హ‌త్య‌చేయించార‌ని అత‌ని భార్య‌త అవంతి ఆరోపిస్తున్న‌ది. హ‌త్య‌తో సంబంధ‌మున్న ఎవ‌రినీ వ‌ద‌ల‌వ‌ద్ద‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా పోలీసులు ఇప్ప‌టికే ఈ కేసులో 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. మ‌రో ఇద్ద‌రి కోసం గాలింపు చేప‌ట్టారు.

తెలంగాణ‌లో మ‌రో ప‌రువుహ‌త్య‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts