ప్రియుడిని క‌లిసేందుకు వెళ్లిన కూతురు.. న‌రికి చంపిన తండ్రి

September 16, 2020 at 9:46 pm

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో ప‌రువుహ‌త్య వెలుగుచూసింది. కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న ఓ యువ‌తి ఇటీవ‌లే త‌ల్లిదండ్రుల‌ను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకోగా, తండ్రి, సోద‌రుడు, బంధువులు స‌ద‌రు ప్రియుడిని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సంఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రోక‌టి వెలుగుచూడ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తున్న‌ది. ప్రేమికుడిని కలవడానికి వెళ్లిందని కన్నకూతురిని కడతేర్చాడో తండ్రి. ఈ పరువు హత్య ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జరగ్గా స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. కాన్పూర్‌ రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన‌ కులానికే చెందిన‌, త‌మ ఎదురింట్లో ఉండో ఓ యువకుడితో ఏడిదిన్నరగా ప్రేమ వ్యవహారం కొన‌సాగిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో మంగళవారం అర్థరాత్రి తండ్రి పడుకున్న సమయం చూసి ఎదురింట్లో ఉన్న తన ప్రియుడిని కలువడానికి ఆ బాలిక‌ వెళ్లింది. ఈ విషయాన్ని గ‌మ‌నించిన బాలిక తండ్రి చ‌ప్పుడు చేయ‌కుండా గొడ్డలి తీసుకొని నేరుగా బాలుడి ఇంటికి వెళ్లాడు. వారిద్ద‌రిపై గొడ్డ‌లితో దాడిచేశాడు. తీవ్ర గాయాల‌పాలైన బాలిక‌ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. ప్రియుడు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ దినేశ్‌ చంద్ర సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరీస్థితిని సమీక్షించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియుడిని క‌లిసేందుకు వెళ్లిన కూతురు.. న‌రికి చంపిన తండ్రి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts