బిగ్‌బాస్‌లోకి నేడు మ‌రో వైల్డ్ కార్డు ఎంట్రీ.. అస‌లు ప్లాన్ ఏంటంటే?

September 25, 2020 at 9:09 am

బిగ్‌బాస్ సీజ‌న్ 4.. ఇటీవ‌ల అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మూడో వారంలోకి అడుగు పెట్టిన ఇంటి స‌భ్యులు.. బిగ్ బాస్ ఇంటిని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేసేరు. ఇక ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ కాగా.. వారి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తూ వైల్డ్ కార్డు ద్వారా కుమార్ సాయి, జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో అవినాష్ ఎంట్రీ వ‌ల్ల బిగ్ బాస్ షోకు కాస్త హైప్ క్రియేట్ అయింది.

అయితే మ‌రో వైల్డ్ కార్డు ఎంట్రీని సిద్ధం చేశారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు. ఈ రోజు మరో బ్యూటీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ లేదా యామిని భాస్కర్ ఇంట్లోకి అడుగు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆమె ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండ‌బోతుందో ఈ రోజు రాత్రి చూడాల్సిందే.

కాగా, బిగ్ బాస్ మొదటి గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ కు రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఎపిసోడ్ మిన‌హా మిగిలిని ఎపిసోడ్లు ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదని నెటిజన్స్ మరియు బిగ్ బాస్ ల‌వ‌ర్స్‌ పెదవి విరిచేసారు. దీనితో బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌కు పెద్ద షాక్ లా తగిలింది. దీనితో బిగ్ బాస్ టీమ్ ముందుగానే వైల్డ్ కార్డు ఎంట్రీలు దింపేశారు. దీనితో అక్కడ నుంచి షో రేటింగ్ బాగానే వస్తుంది అని తెలుస్తుంది. ఇక ఇవాళ ఎంట్రీ ఇవ్వబోయే బ్యూటీ ఎవ‌రో తెలియాల్సి ఉంది.

బిగ్‌బాస్‌లోకి నేడు మ‌రో వైల్డ్ కార్డు ఎంట్రీ.. అస‌లు ప్లాన్ ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts