డ్రైనేజీలో దొరికిన భారీ ఎలుక… !! తీరా దగ్గరికి వెళ్లి చూస్తే షాక్ లో సిబ్బంది… !!

September 23, 2020 at 7:59 pm

మన భారత దేశంలో ఎలుకలకు కొదవ లేదు. చాలా మంది ఇళ్లల్లో ఎలుకలు నివాసం ఉంటాయి. అలాగే డ్రైనేజీ లలో కూడా మనం ఎలుకల్ని చూస్తూ ఉంటాము. అయితే మనం చూసే ఎలుకల సైజ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. చిన్న పరిమాణంలో ఉంటాయి.. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే పంది కొక్కు అని అంటాము.. అంతేగాని భారీ సైజ్ లో ఉన్న ఎలుకలను మనం ఎప్పుడు చూసి ఉండము. అయితే ఇప్పుడు ఇందులో వింత ఏమి ఉంది అని అనుకుంటున్నారా.. !! నిజంగానే వింత ఉంది. ఈ భారీ పరిమాణంలో ఉన్న ఎలుక ఇప్పుడు మెక్సికో లోని డ్రైనేజీలో దొరికింది. గత కొంత కాలంగా మెక్సికోలో డ్రైనేజీలు బ్లాక్ అవుతూ ఉన్నాయి.

దీనితో డ్రైనేజీ తనిఖీ చేయడం కోసం అక్కడ మునిసిపాలిటీ సిబ్బంది సిద్ధం అయ్యారు. అయితే అక్కడ డ్రైనేజీలో ఒక పెద్ద భారీ పరిమాణంలో ఉన్న ఎలుక సిబ్బందికి కనిపించింది. కానీ ఆ ఎలుక చనిపోయి ఉంది. దీనిని చూడడానికి అక్కడ సిబ్బంది పెద్ద ఎత్తున వచ్చారు. తీరా ఆ ఎలుకని బయటకి తీసి శుభ్రం చేసి పరిశీలించాక గాని తెలియలేదు అది నిజం ఎలుక కాదు.. బొమ్మ ఎలుక అని. ఇది తెలిసి అందరు షాక్ లో ఉండిపోయారు. హాలోవీన్ నేపథ్యంలో ఒక పెద్ద ఎలుక బొమ్మను డ్రైనేజీలో పడవేసి ఉంటారని కనుగొన్నారు. అయితే ఇప్పుడు ఈ భారీ ఎలుక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..

డ్రైనేజీలో దొరికిన భారీ ఎలుక… !! తీరా దగ్గరికి వెళ్లి చూస్తే షాక్ లో సిబ్బంది… !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts