ఈ జంతువులను చుస్తే మానసిక ఒత్తిడి మాయం..!

September 28, 2020 at 4:36 pm
KOKKAS

చాల మంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. ఇక చాలమంది కుక్కలు, పిల్లులు, ఇతరత్రా జంతువులను ఇళ్లలో పెంచుకుంటున్నారు. ఇంట్లో పెంపుడు జంతువులు మనం ఎం చేస్తుంటే అవి కూడా అలాగే చేస్తుంటాయి. అయితే ఇటీవల పెంపుడు జంతువుల ముద్దుచేష్టలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నా సంగతి అందరికి తెలిసిందే. ఆ వీడియోలను చాల మంది ఎంతో ఆసక్తిగా చూస్తుంటున్నారు. అయితే ఆ వీడియో చూడడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా అనే కోణంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ ముద్దుముద్దు జంతువుల చిత్రాలు, వీడియోలు చూస్తే మాససిక ఒత్తిడిస్థాయిలు 50 శాతం తగ్గిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌, టూరిజం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కోణంలో 19 మందిపై అధ్యయనం జరిపారు. ఇక వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాలో కనిపించే కోక్కాస్ అనే జంతువు వీడియోలను 30 నిమిషాలు చూపించారు. దీనికి ప్రపంచంలో సంతోషకరమైన జంతువుగా పేర్కొందని తెలిపారు. అనంతరం వారిని పరీక్షించగా వారిలో ఒత్తిడిస్థాయి దాదాపు 50 శాతం తగ్గినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు అందమైన జంతువుల వీడియోలు చూడాలని తమ అధ్యయనం సూచిస్తున్నదని ఇందులో పాల్గొన్న పరిశోధకురాలు డాక్టర్ ఆండ్రియా ఉట్లే వెల్లడించారు.

 

ఈ జంతువులను చుస్తే మానసిక ఒత్తిడి మాయం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts