ఏపీ లో కొనసాగుతున్న కరోనా కేసులు… కొత్తగా మరో 7,855 కేసులు…!

September 24, 2020 at 6:54 pm

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొద్దీ మేర తగ్గినా కాస్త కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ తీవ్రత పెరిగినా ప్రజల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రజలు కరోనా నింబంధనలను గాలికి వదిలేశారు. చాలామంది మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించడం అంటూ ఎక్కడ కనపడట్లేదు. కొన్ని ప్రదేశాలలో ఇలాంటి వాటిని చూసి కూడా పోలీసు అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనితో కేసులు రోజురోజుకి ఒకరి నుండి మరొకరికి కరోనా వ్యాప్తి అవుతుంది. మరికొందరికి కరోనా వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలు లేకుండా పోవడంతో కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగా సాగుతోంది.

ఇక నేడు ఏపీ ఆరోగ్యశాఖ గడిచిన 24 గంటలలో నమోదైన కేసుల వివరాలను కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 76000 సాంపిల్స్ ను పరిషగా అందులో 7,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొవిడ్‌-19 కేసుల సంఖ్య 6,54,385 కు చేరింది నిన్నటి రోజున రాష్ట్రవ్యాప్తంగా 52 మంది కరోనా వైరస్ బారినపడి మరణించారు. ఇక ప్రస్తుతం ఏపీ లో 69,353 కరోనా కేసులు యాక్టివ్‌ లో ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,79,474 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. నేటితో మోతంగా రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5558 కు చేరుకుంది.

ఏపీ లో కొనసాగుతున్న కరోనా కేసులు… కొత్తగా మరో 7,855 కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts