ఆంధ్ర ప్రదేశ్ లో ఆగని కొత్త కేసుల సంఖ్య… నేడు కొత్తగా 7,293 కేసులు

September 26, 2020 at 7:47 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను మీడియాకు తెలపడం జరిగింది. ఇక బులిటెన్ లో తెలిపిన వివరాల ప్రకారం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 75 ,990 శాంపిల్స్ పరీక్షించగా అందులో 7,293 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈ సంఖ్యతో కలుపుకొని నేటితో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 6 ,65 ,856 కు చేరుకుంది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 9,125 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుండి కోల్పోయిన వారి సంఖ్య 5 ,94 , 399 కి చేరుకుంది.

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65, 794 కేసులు యాక్టివ్గా కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారినపడి 56 మంది మృతి చెందారు. దీంతో నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దెబ్బకు మృతి చెందిన వారి సంఖ్య 5663 కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55, 23,786 శాంపిల్స్ ను అధికారులు పరీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 93,184 కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 633 మరణాలు సంభవించాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో ఆగని కొత్త కేసుల సంఖ్య… నేడు కొత్తగా 7,293 కేసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts