రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు బిగ్ షాక్‌?

September 29, 2020 at 8:56 am

రైల్వే ప్ర‌యాణ‌కుల‌కు బిగ్ షాక్ ఇచ్చేంద‌సుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ట్రైన్ టికెట్ ధరలు పెంచే నిర్ణ‌యం దిశ‌గా రైల్వేశాఖ అడుగులు వేస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న పలు రైల్వేస్టేషన్లలో ప్రయాణీకుల నుంచి టికెట్ ధరలపై కనిష్టంగా రూ. 10 నుంచి గరిష్టంగా రూ. 35 వరకు యూజర్ చార్జీలను వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

త్వరలోనే దీన్ని కేంద్ర కేబినెట్ ముందుకు పంపించనుందని సమాచారం. దీంతో మీరు మొత్తంగా గతంలో కన్నా రానున్న రోజుల్లో ఎక్కువ టికెట్ రేటు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త యూజ‌ర్ చార్జీలు అందరికీ వర్తించవు. పునరాభివృద్ధి లేదా పాత స్టేషన్లను కొత్తగా మార్చిన రైల్వే స్టేషన్లలో ట్రైన్ ఎక్కే వారికి మాత్రమే ఈ కొత్త యూజ‌ర్ చార్జీలు వర్తిస్తాయి.

దేశంలో సుమారు ఏడు వేల రైల్వే స్టేషన్లు ఉండగా.. అందులో 700-1000 స్టేషన్ల నుంచి ప్రయాణించే వారిపై ఈ భారం పడనుంది. ముఖ్యంగా ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులపై రూ. 35 అదనపు రుసుము పడే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కాగా, రైల్వే ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయడం ఇదే తొలిసార‌ని చెప్పాలి.

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు బిగ్ షాక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts