మోదీకి వెంక‌న్న ద‌ర్శ‌నం.. జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు!

September 24, 2020 at 9:56 am

సెప్టెంబ‌రు 19 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమ‌ల వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

అయితే కరోనా నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ‌గా.. బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలకు వచ్చిన జగన్ అన్నమయ్య భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అయితే సీఎం జగన్మోహ‌న్ రెడ్డి కూర్చున్న సీటు వెనకాలే శ్రీ వెంకటేశ్వరుడి పెద్ద చిత్రపటం ఉంది.

దీన్ని గమనించిన ప్ర‌ధాని మెదీ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తనకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయినందుకు తనకెంతో ఆనందంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి, తనతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం అభినందనీయమని జగన్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

మోదీకి వెంక‌న్న ద‌ర్శ‌నం.. జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts