ర‌ష్మిక దొంగ వేషాలు.. అవి క‌నిపిస్తే చాలు నొక్కేస్తుంద‌ట‌!

September 23, 2020 at 7:28 am

వ‌రుస విజ‌యాల‌తో జోరు మీద ఉన్న ర‌ష్మిక మందన్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల సరిలేకు నీకెవ్వరు, భీష్మ వంటి సూప‌ర్ హిట్లు కొట్టిన ర‌ష్మిక.. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప` సినిమాలో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అభిమానుల‌తో ముచ్చ‌టించిన ర‌ష్మిక త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఓ వింత అల‌వాటు ఉంద‌ని చెప్పింది ర‌ష్మిక‌. సినిమా షూటింగుల నిమిత్తం వివిధ ప్రాంతాలు వెళతారు కదా! అక్కడ హోటల్స్‌లో షాంపూలు నచ్చితే వాటిని నొక్కేస్తానని రష్మికా మందన్నా తాజాగా ట్విట్టర్‌ లైవ్‌ సెషన్‌లో చెప్పారు. ఒకసారి పిల్లో కవర్‌ కూడా దొంగిలించానని ఆమె అన్నారు. వాటి గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా అపరాధ భావన కలుగుతోంద‌ని ర‌ష్మిక తెలిపింది.

అలాగే షూటింగ్స్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్‌కి వెళ్లడం అంటే ప్రతిరోజూ ఎగ్జామ్స్‌ రాయడానికి వెళ్లినట్టే. డైలాగ్స్‌ గుర్తుపెట్టుకోవాలి. సన్నివేశానికి తగ్గట్టు బాగా యాక్ట్‌ చేయాలి. అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. అలాగే చాలా థ్రిల్లింగ్‌గానూ ఉంటుంద‌ని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రతి విషయానికి నవ్వడం, ఎక్కువ ఆందోళన చెందడం, హైపర్‌గా ఉండటం… ఈ మూడు అలవాట్లు తనను బాధిస్తున్నాయని రష్మిక తెలిపారు.

ర‌ష్మిక దొంగ వేషాలు.. అవి క‌నిపిస్తే చాలు నొక్కేస్తుంద‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts