రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ డేటింగ్.. క‌లిసే ఉంటున్నార‌ట‌?

September 30, 2020 at 2:36 pm

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కుమారి 21 సినిమాలో నటించి సూప‌ర్‌ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, అంధగాడు చిత్రాల్లో జంటగా నటించారు. ఇలా వ‌రుస సినిమాలు చేయ‌డంతో.. ఆ మ‌ధ్య వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్‌ న‌డుస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై హెబ్బా చాలాసార్లు వివరణ ఇచ్చినా పుకార్లు ఆగ‌లేదు.

ఇక తాజాగా రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ డేటింగ్ లో ఉందా.. అనే అనుమానాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఇందుకు కార‌ణం హెబ్బా తాజాగా చేసిన వ్యాఖ్య‌లే కార‌ణం అని చెప్పాలి. ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్ న‌టించిన తాజా చిత్రం `ఒరేయ్ బుజ్జిగా` అక్టోబర్ 2న ఆహా‌లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, మాళవిక అయ్యర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇక విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు మేక‌ర్స్‌. ఇందులో భాగంగా ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తన కెరీర్లో 90 శాతం రాజ్ తరుణ్ తో కలిసే నటించానని చెప్పింది. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉంటున్నామని తెలిపింది. దీంతో ఇద్ద‌రు డేటింగ్‌లో ఉన్నారా అన్న‌ది హాట్ టాపిక్ అయింది.

రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ డేటింగ్.. క‌లిసే ఉంటున్నార‌ట‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts