ఐపీఎల్ 2020: జ‌నాలు లేరు కానీ, స్టేడియం మాత్రం గోలగోల!

September 20, 2020 at 1:55 pm

క్రెకిట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ ఎట్టకేలకు షురూ అయింది. యూఏఈ గడ్డపై ఐపీఎల్ 2020 సీజన్ నిన్న సాయంత్రం 7.30 కు ప్రారంభమైంది. యావత్ ప్రపంచంపై కరోనా వైరస్ దాడి చేసిన తర్వాత ప్రారంభ‌మైన‌ ఒక మెగా క్రికెట్ టోర్నీ ఇది. అబూధాబీలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ఫ్యాస్ట్ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించింది.

అయితే స్టేడియంలలోకి ప్రేక్ష‌కుల‌నుగాని, మీడియాగాని అనుమతి లేదని ప్రకటించింది. కరోనా వల్ల భౌతికదూరం పాటించాల్సి రావడంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే నిన్న జ‌నాలు లేక‌పోయినా.. చప్పట్లు, కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది. అదెలా అంటే.. ఐపీఎల్‌ నిర్వాహకులు టీవీ ప్రేక్షకుల కోసం మాయ చేశారు.

లీగ్‌ ఆరంభానికి ముందే రికార్డు చేసిన శబ్దాలను మ్యాచ్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఉన్న అనుభూతిని క‌ల‌గ‌జేశారు. ఐపీఎల్‌ నిర్వాహకులు చేసిన ఈ ప్ర‌య‌త్నం బాగానే వ‌ర్కోట్‌ అయింది. ఆటకు, అరుపులకు సింక్ అద్భుతంగా కుదిరింది. దీంతో స్టేడియంలో ప్రేక్ష‌కుల లేరు అన్న భావ‌నే క‌ల‌గ‌లేదు. ఇక ఈ ప్లాన్ ఆకట్టుకుందని కొందరంటే… లీగ్‌ను సహజంగా చూపిస్తేనే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐపీఎల్ 2020: జ‌నాలు లేరు కానీ, స్టేడియం మాత్రం గోలగోల!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts