కోహ్లీ సేన అసాధార‌ణ విజయం.. ఓ త‌ప్పు వ‌ల్లే ముంబై ఓడిందా?

September 29, 2020 at 10:33 am

ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. అందులో ఒక్క కెప్టెన్ కోహ్లీ (3) తప్ప మిగతా అందరూ ముంబయి బౌలింగ్ ను చీల్చి చెండాడారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇక 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.

రోహిత్ శర్మ (8), డికాక్ (14), సూర్యకుమార్ యాదవ్ (0), హార్దిక్ పాండ్యా (15) వంటి వారు కూడా త‌క్కువ స్కోర్ చేయ‌డంతో.. ఓట‌మి ఖాయ‌మ‌ని ఫిక్స్ అయ్యారు. అయితే అప్పుడు రంగంలోకి దిగిన ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్‌లు అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుటయ్యాడు. ఇక పొలార్డ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చేసింది.

అయితే విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా, ఉడానా వేసిన బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ అవ‌సరమైంది. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో కోహ్లీ సేన ఆసాధార‌ణ విజయం సాధించింది. కానీ, ముంబై చేసిన త‌ప్పు ఏంటంటే.. సూపర్ ఓవర్లో ఇషాన్ కిషన్‌ను ఆడించక‌పోవ‌డ‌మే. ఇషాన్ కిషన్ అలసిపోయి, చెమట కారణంగా అసౌకర్యంగా ఉండటంతో.. అతడి బదులు హార్దిక్ పాండ్యను బరిలో దింపాడు రోహిత్‌. అదే లెఫ్ట్ హ్యాండర్ అయిన ఇషాన్ కిషన్ బ‌రిలోకి దిగుంటే కచ్చితంగా ప్లస్ అయ్యేవాడు. ఇక చివ‌ర‌కు సాధించాల్సింది 8 రన్సే కావడంతో కోహ్లి బరిలో దిగి.. విజయం త‌మ సొంతం చేసుకున్నాడు.

కోహ్లీ సేన అసాధార‌ణ విజయం.. ఓ త‌ప్పు వ‌ల్లే ముంబై ఓడిందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts