మోదీతో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్..!

September 23, 2020 at 8:09 pm

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు చేరుకున్నారు. ఆయన టీటీడీ అన్నమయ్య భవన్‌లో ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పట్టు వస్త్రాలతో కనిపించారు. ఈ సమావేశంలో యూపి, పంజాబ్, ఢిల్లీ, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సియంలతో విడియో కాన్పరేన్స్ లో చర్చించనున్నారు ప్రధాని మోడీ.

ఈ సమావేశంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్ర సీఎంలతో ప్రధాని మాట్లాడారు. ఆయన స్వామి వారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుమందు బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పద్మావతి అతిథిగృహంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ముఖ్యమంత్రిని కలిశామని ఈ సందర్భంగా రమణ దీక్షితులు తెలిపారు. అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

మోదీతో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts