జ‌పాన్ స‌రికొత్త ప‌థ‌కం.. యువ‌కుల‌కు పెళ్లి క‌ట్నం

September 25, 2020 at 11:42 am

మ‌న‌దేశంలో క‌ట్నం తీసుకోవ‌డం.. ఇవ్వ‌డం రెండూ చ‌ట్ట‌రీత్యా నేర‌మే. కానీ జ‌పాన్ ప్ర‌భుత్వ‌మే యువ‌కుల‌కు పెల్లి క‌ట్నాన్ని ఇవ్వ‌బోతున్న‌ది. ఈ మేర‌కు ఇటీవ‌ల తాజాగా నిర్ణ‌యం తీసుకోవ‌డం ట్రెండింగ్‌గా మారింది. పెండ్లి మీరు చేసుకోండి.. మీకు మేము క‌ట్నాల‌ను అందిస్తామ‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకి వెళితే.. జపాన్‌లో జ‌నాభా రోజురోజుకూ త‌గ్గిపోతున్న‌ది. మ‌రోవైపు ఉన్న యువ‌కులేమో పెళ్లి చేసుకునేందుకు అనాస‌క్తిని చూపుతున్నారు. కార‌ణం ఆర్థిక స‌మ‌స్య‌లే. దీంతో ప్ర‌స్తుతం ఆ దేశంలో పెళ్లి కానీవారి సంఖ్య రోజురోజుకూ విప‌రీతంగా పెరిగిపోతున్న‌ది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే మొత్తం కుటుంబ వ్య‌వ‌స్థ‌నే చిన్నాభిన్న‌మ‌య్యేలా ఉంది. అదీగాక ఇది భ‌విష్య‌త్‌లో దేశా ఆర్థికాభివృద్ధిపై పెను ప్ర‌భావాన్ని చూపే అవ‌కాశ‌మున్న‌ది. అందుకే దీని నివార‌ణ‌కు జ‌పాన్ ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది.

యువ‌కుల‌ను పెళ్లి చేసుకునేలా ప్రోత్స‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందులోభాగంగానే స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. పెళ్లి చేసుకోవాల‌నే యువ‌కుల‌కు 4ల‌క్ష‌ల 50వేల న‌గ‌దు ప్రోత్స‌హాకాన్ని అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. మీరు పెండ్లి చేసుకోండి మేం క‌ట్నాలు ఇస్తాం అంటూ ప్ర‌చారానికి తెర‌లేపింది. అయితే ప్ర‌భుత్వం అన్నాక ఎలాంటి ష‌ర‌తు లేకుండా ప్రోత్స‌హాకాల‌ను ఎందుకు అందిస్తుంది. ఇప్పుడు జ‌పాన్ ప్ర‌భుత్వం కూడా పెళ్లి ప్రోత్స‌హాకాన్ని అందుకునే యువ‌కుల వార్షిక ఆదాయం5.2 మిలియ‌న్ యెన్లు ఉండాల‌ని నిబంధ‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. అది అటుంచితే జ‌పాన్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతోనూ యువ‌కులు పెళ్లి చేసుకుంటారో? లేదో చూడాలి మ‌రి.

జ‌పాన్ స‌రికొత్త ప‌థ‌కం.. యువ‌కుల‌కు పెళ్లి క‌ట్నం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts