జపాన్‌లో ఎన్టీఆర్‌ క్రేజ్ సూప‌రంతే.. వైర‌ల్ వీడియో!

September 15, 2020 at 5:47 pm

నంద‌మూరి వార‌సుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకమైన‌ గుర్తింపు ఏర్ప‌ర్చుకోవ‌డంతో పాటు ప్రస్తుతం స్టార్ హీరోగా సైతం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఈయ‌న సినిమాలు వ‌స్తున్నాయంటే.. అభిమానులు పండ‌గ చేసుకుంటార‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చేస్తున్నాడు.

Japan pair NTR Vayasunami song - TV9 Telugu

ఆ త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా తీయకుండా ఇత‌ర దేశాల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవ‌రైనా ఉన్నారంటే.. టాలీవుడ్ నుంచి తారక్ మాత్రమే అని చెప్పాలి. ఎన్టీఆర్‌కు జ‌పాన్ దేశంలో స్పెషల్ క్రేజ్ ఉంది. ఈయన పాటలు చూసి మురిసిపోయేవారు.. నందమూరి చిన్నోడి స్టెప్పులు చూసి ఫిదా అయిపోయే అక్క‌డ చాలా మంది ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే గత రెండు నెలల కితం ఎన్టీఆర్ మాస్ సాంగ్ కు స్టెప్పులేసి టాలీవుడ్ మరియు తారక్ అభిమానుల్లో మంచి హాట్ టాపిక్ అయిన ఒక జపనీయ జంట ఇప్పుడు మరో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో ముందుకు వచ్చారు. తాజాగా కంత్రి సినిమాలోని వయస్సునామి పాటకు అదిరిపోయే స్టెప్పులేసారు. భార్య భర్తలు ఇద్దరు ఇంటి పనులు చేస్తూ నవ్విస్తూనే తారక్ మరియు హన్సికలు వేసిన స్టెప్పులను అచ్చు గుద్దినట్లు దింపేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 

జపాన్‌లో ఎన్టీఆర్‌ క్రేజ్ సూప‌రంతే.. వైర‌ల్ వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts